బాలిక పట్ల అసభ్య ప్రవర్తన పై పోక్సో కేసు నమోదు
విశాలాంధ్ర – సీతానగరం: తల్లిదండ్రులు పిర్యాదు పై బాలిక పట్ల అసభ్యoగా ప్రవర్తన పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ డి రామ్ కుమార్ తెలిపారు. మండలంలో సీతానగరం గ్రామానికి చెందిన 14 సవంత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన పుట్టా వెంకట తేజ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అతడి ఆగడాలు భరించలేక బాలిక యువకుడు విషయం తల్లిదండ్రులకు పిర్యాదు చేసింది. ఇదే విషయం పై తల్లిదండ్రులు పలు మార్లు యువకుడిని తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన యువకుడు అదే విధంగా ప్రవర్తించడం పై యువతి తల్లిదండ్రులు విసుగు చెంది పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. దీనితో ఎస్ ఐ డి రామ్ కుమార్ యువకుడి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది అని అన్నారు.


