Homeఆంధ్రప్రదేశ్నేడు జ్ఞాననిధి పాఠశాలలో ఉచిత ఆధార్ క్యాంప్

నేడు జ్ఞాననిధి పాఠశాలలో ఉచిత ఆధార్ క్యాంప్

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో గల జ్ఞాననిధి ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో నవంబర్ 21 నుంచి 23 తేది వరకూ ఉచిత ఆధార్ క్యాంపు జరగనుంది అని ఎంపిడిఓ ఎమ్ భారతి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ భారతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 17 నుంచి 26 వరకూ వివిధ గ్రామాల్లో ఉచిత ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా నవంబర్ 21వ తేదీన జ్ఞాననిధి పాఠశాల, వేదుళ్లపల్లి పాఠశాలలో ఉచిత ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని అన్నారు. కావున అందుబాటులో ఉన్న విద్యార్థులు ఆధార్  మార్పులు, చేర్పులు ఈ కేవైసీ వంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధార్లో వివరాలు సరిగ్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు విద్యార్దులకు వర్తించవు అని గుర్తించాలని అని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు