విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఆ గ్రామీణ పశు వైద్య నిపుణునికి మూగజీవుల పట్ల వల్లమాలిన ప్రేమ. వాటి బాధల్ని తొలగించే కృషిలో ఎంతో నేర్పుని చూపే పశు వైద్య నిపుణుని ప్రసిద్ధిని పొందిన ఆయన ఇప్పటివరకు 35 పైగా పురస్కారాలు పొందారు. తాజాగా పురస్కారాల ఖాతాలో మరో అరుదైన మరో ఉత్తమ పురస్కారం వచ్చి చేరింది. ఆయన మరెవరో కాదు మండల కేంద్రం ఉంగుటూరుకి చెందిన పశు వైద్య నిపుణుడు, లైవ్ స్టాక్ అధికారి డాక్టర్ మల్లిపూడి చిన బాబు రావు. ఈ నెల 15న హైదరాబాద్ కి చెందిన బెస్ట్ ఆర్ట్స్ ఆకాడమీ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 15న పుచ్చలపల్లి సుందరయ్య కళానికేతన్ లో మల్లిపూడి ప్రముఖుల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న మల్లిపూడిని స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత డాక్టర్ బాబురావు మాట్లాడుతూ.. ఈ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.