Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగర్భిణీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరం..

గర్భిణీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరం..

- Advertisement -

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ

విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, అప్పుడే సుఖవంతమైన ప్రసవం కలుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా దుర్గా నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్లో 45 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా చింతా రామన్న (ఎల్ఐసి రాము) ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గర్భిణీలు పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రశాంత జీవనమును గడపాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని తెలిపారు. అనుభవం గల వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండి చక్కటి వైద్య చికిత్సలను అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, దాత రామన్న, ఆత్మీయ సలహాదారు మనోహర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు