Homeఆంధ్రప్రదేశ్డస్ట్ బిన్ తప్పనిసరి

డస్ట్ బిన్ తప్పనిసరి

- Advertisement -

ప్రతి దుకాణం వద్ద డస్ట్ బిన్ తప్పనిసరి*

*కమిషనర్ రాహుల్ మీనా*

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం ; నగరంలోని ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్ట తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది విధులకు వస్తున్నదీ రికార్డులు ఉండాలన్నారు. రహదారులు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ వేయాలన్నారు. ప్రధాన రహదారులు, వార్డుల్లో ఉన్న సెంట్రల్‌ డివైడర్లలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని.. ముఖ్యంగా కమర్షియల్ ఏరియాలలో రాత్రి వేళల్లో శానిటేషన్ పనులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మాంసం దుకాణాల వద్ద నెట్ లు తప్పనిసరిగా వినియోగించాలని యజమానులకు సూచించారు. అలాగే నగరవాసులు రోడ్ల వెంబడి ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా జరగాలని.. ఎవరైనా ప్లాస్టిక్‌ ను విక్రయించినా, ప్లాస్టిక్‌ కవర్లతో నిత్యావసర సరుకులు ఇచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్‌ రహిత రాజమహేంద్రవరం లక్ష్యసాధనకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు