ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తారకరామాపురం (గుట్ట కింద పల్లి) లోగల పాలిటెక్నిక్ కళాశాల యందు ఈనెల 26వ తేదీ ఉదయం 9గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలు ఉద్యోగములు కొరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి నుండి డిగ్రీ అండ్ పీజీ పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు అని తెలిపారు. నెలకు 15000 నుండి 25వేల రూపాయల వరకు జీతం ఉంటుందని తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారు పెనుకొండ ,కడప ,పాలసముద్రం, అనంతపురం బెంగళూరులలో ఉద్యోగం చేయవలసి ఉంటుందని తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు విద్యార్హత పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 9182288465సంప్రదించాలని తెలిపారు.
జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


