Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం( విజయనగరం జిల్లా) : ఈరోజు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ మాట్లాడుతూ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం భారత దేశ ప్రజలకు అవసరమైన హక్కులు, విధులు మరియు ఆదేశిక సూత్రాలను రూపొంచిందని మరియు పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగితే వాటికి ఉపశమన మార్గాలను కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన రోజును ప్రతి భారతీయులు భారత రాజ్యాంగం పట్ల అందులో ఉన్నటువంటి హక్కులు , విధులు పట్ల స్పృహ కలిగి ఉండాలని అంతే కాకుండా ప్రజలకు వర్తించే విధులను కూడా అందరూ పాటిస్తూ రాజ్యాంగం మౌళిక స్వరూపాన్ని కాపాడుతూ నడుచుకోవాలని కోరుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ మిఠాయి లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు