-టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి
విశాలాంధ్ర-రాప్తాడు : మహానేత ఎన్టీఆర్, కార్మిక శాఖ మాజీ మంత్రి దివంగత పరిటాల రవి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి ప్రజల మనసుల్లో ముద్ర వేసుకుకున్నారని టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులిలో ఎన్.టీ.ఆర్, పరిటాల రవి విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన మేరకు బుధవారం మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట భూమి పూజ చేశారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో టిడిపిని స్థాపించిన కొన్ని నెలల కాలంలోనే పేద ప్రజలకు రూ.2కే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. పరిటాల రవి ఆరాచకశక్తులకు అడ్డుగా నిలిచి ప్రజలను కాపాడుకున్నారని అన్నారు. మండలంలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. అనంతరం అంగన్వాడీ మాజీ టీచర్ కుమ్మర సరోజ విగ్రహాల ఏర్పాటుకు రూ.20వేలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు సాకే తిరుపాలు, మిడతల శీనయ్య, నరేష్, మరూరు, బుక్కచెర్ల సొసైటీ అధ్యక్షుడు గోనుగుంట్ల గోపాల్, బ్రహ్మానందరెడ్డి, ఎస్.జె.ఆర్. కన్స్ట్రక్షన్స్ అధినేత సాకే జయరాముడు, కురుబ సాధికారత రాష్ట్ర కన్వీనర్ గంగలకుంట రమణ, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


