Thursday, January 15, 2026
Homeజిల్లాలునెల్లూరుప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు

ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు

- Advertisement -

విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండల ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఈ సందర్బంగాబుధవారం విశాలాంధ్ర విలేకరి తో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆకాక్షించారు.గౌరవాయుత, ప్రెండ్లీ పోలీసింగ్ నూతన దిశగా ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ లు మరియు 112 ద్వారా 24గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు.అలాగే యువతను చెడు అలవాట్లు, మత్తు పదార్థాల విషయంలో ఎస్ ఐ హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆదర్శంగా నిలవాలని, అవి యువత జీవితాన్ని నాశనం చేస్తాయని స్పష్టం చేశారు. మత్తు వల్ల కుటుంబాలు, ఉద్యోగఅవకాశాలు, పాస్ పోర్ట్ఇతర అధికారిక అవసరాలలో సిక్కులు ఏర్పడతాయని గుర్తు చేశారు.మండలంలో కోడి పందేలు, పేకాటలు ఇతర జూదాలపై పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జూదాల పట్ల ప్రజలు తక్కువ సమయంలో తమ మూలాదారాలు కోల్పోతున్నారని, కుటుంబాలకు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.కోడి పందేల నిర్వాహకులు, జూదరులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.వాహనదారులకు నెంబర్ ప్లేట్లను తప్పనిసరిగా కలిగి ఉంచుకోవాలని, అలాగే నెంబర్ మార్చి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్టీఏ పత్రాలు కలిగివుండాలని అన్నారు.ట్రాక్టర్/ట్రాలీ యజమాని ఇద్దరు నెంబర్ ప్లేట్లు ఉండాలని, బండి నడిపే వ్యక్తి కనీసం 18సంవత్సరాలు పూర్తి వయసు కలిగి ఉండాలని ఎస్ ఐ స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి పోలీసులు రోజూ 24గంటల సామర్థ్యంతో పని చేస్తున్నట్లు ఎస్ ఐ పేర్కొన్నారు. మహిళలు యువకులు, ఇతర పౌరులు ఏవైనా ఆపశ్రుతి, అనుమానం లేదా ఇబ్బంది ఎదురైనప్పుడు తమ స్థానిక పోలీస్ లేదా 112 కు వెంటనే సమాచారం ఇస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రజలు అందరూ బాధ్యతగా ఉండి చట్టపరమైన విధానాలను పాటించాలని మండలప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు