Wednesday, December 18, 2024
Homeజిల్లాలుకర్నూలుదాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం


–పరగొండ జోజన్న

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా జిల్లా అధ్యక్షులు పరగొండ జోజన్న ఆరోపించారు. బుధవారం స్థానిక ఎస్సీ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా మండల కమిటీ సమావేశాన్ని కొమ్ము రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పరగొండ జోజన్న పాల్గొని మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం సరిహద్దు నియోజకవర్గమైన ఆలూరు ప్రాంతంలో దళితులు ఎక్కువ వివక్షతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కుల వివక్షత ఉండడం పాలకులు అధికారులు వైఫల్యమేనన్నారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా బంగి రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా కొమ్మ రమేష్, ఉపాధ్యక్షుడిగా కాశప్ప గారి దశరథ రామయ్య, సహాయ కార్యదర్శిగా కైరిప్పుల రంగన్న, అలాగే మండల మహిళా కార్యదర్శి బుజ్జమ్మ, సహాయ కార్యదర్శిగా జ్యోతి లతోపాటు 11 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పరమేష్, మధు, గుండ్రాల వీరభద్రి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు