Tuesday, November 18, 2025
Homeజిల్లాలుకర్నూలుతెనాలి ఘటనలో సీఐలను తొలగించాలి

తెనాలి ఘటనలో సీఐలను తొలగించాలి

- Advertisement -

ఉమాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది

జిల్లా అధ్యక్షులు మహానంది

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దారుణంగా ప్రవర్తిస్తున్న సిఐల ను తక్షణమే విధులు నుండి తొలగించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుడిసె మహానంది డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓల్డ్ ఎస్సీ కాలనీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల వ్యవధిలోనే తెనాలిలో జరిగిన రెండు ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెనాలి లోయువకులను దారుణంగా కొట్టిన సంఘటనలో కారకులైన ఇద్దరు సీఐలను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. రాష్ట్ర హోం మంత్రి అనిత దళితురాలు అయినా ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకాకుండా సమర్ధించడం శోచనీయమన్నారు. మహారాష్ట్రకు చెందిన బంగారు వ్యాపారి సిద్దేశ్ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం పై హైకోర్టు సుమోటో కేసుగా నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం ఆలూరు తాలూకా కన్వీనర్ భరత్ వీరేష్, బంగారు, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు