Saturday, June 14, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లానాడు గుర్తుకురాని దళితులు నేడు కుల రాజకీయాలకు అవసరమా జగన్…తంగిరాల సౌమ్య

నాడు గుర్తుకురాని దళితులు నేడు కుల రాజకీయాలకు అవసరమా జగన్…తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-దళిత ద్రోహి దళిత వ్యతిరేక పాలనకు బ్రాండ్ అంబాసిడర్ గంజాయి మాఫియా క మేనమామల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం ఆమె కార్యాలయం నుండి ఓ ప్రకటన ద్వారా మాట్లాడుతూ వైఎస్ జగన్‌ రెడ్డి పాలనలో దళితులు ఎదుర్కొన్న అవమానాలు, దాడులు,అన్యాయాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని,ఇప్పుడు తెనాలిలో జరిగిన ఘటనపై ఆయన స్పందన చూస్తే,దళితుల పట్ల ఉన్న అసలు ధోరణి మళ్లీ బయటపడిందని, నిజమైన బాధితులకు మొహం చూపని జగన్, నేరస్తులను పరామర్శించడం మానవత్వమా అని ఆమె ప్రశ్నించారు తెనాలిలో ఓ కానిస్టేబుల్‌ ను చంపేందుకు ప్రయత్నించిన గంజాయి మాఫియాతో సంబంధాలున్న రౌడీషీటర్ల ను పరామర్శించేందుకు జగన్ వెళ్లడం ఎంత దుర్మార్గమో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రని కులాలు నేడు ఎందుకు అని ప్రశ్నించారు నేరస్తులను కులం పేరుతో రక్షించాలను కోవడం కేవలం కుల రాజకీయం మాత్రమే కాదని,ఇది పోలీసు వ్యవస్థను అవమానపరచడం,దళితుల గౌరవాన్ని కించపరచడమే అని అన్నారు,జగన్ పాలనలో దళితుల పట్ల జరిగిన లెక్కలేనన్ని దాడులలో కొన్ని ఘటనలు ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు డా సుధాకర్ అవమానం మాస్కులు అడిగినందుకు లాఠీతో కొట్టించారు.మానసిక రోగిగా చిత్రీకరించారు.చివరికి అనుమానాస్పదంగా చనిపోయారు ఆనాడు జగన్ ఒక్క మాట మాట్లాడలేదని,ఓం ప్రతాప్ హత్య కల్తీ మద్యం వ్యతిరేకంగా పోరాడిన ఓ యువ దళితుడిని హత్య చేశారు ఆనాడు జగన్ స్పందించలేదు,డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ మృతదేహాన్ని ఇంటి ముందు వదిలారు నాడు ప్రభుత్వం న్యాయం చేయలేదు అతన్ని కనీసం పదవి నుంచి కూడా తొలగించలేదు,శిరోముండనం ఘటన లో పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడిని అవమానించారు నాడు స్పందించలేదు పైగా నిందితులను కాపాడే ప్రయత్నమే జరిగింది,నందిగామ దళితులపై దాడులు ఇళ్ల స్థలాల కబ్జాలు,మహిళలపై దాడులు,
ముఖ్యంగా చదువుకుంటున్న దళిత విద్యార్థిపై మూత్రం పోసిన ఘటనలో జగన్ ఎక్కడా స్పందించలేదు కనీసం అప్పటి మొండితోక బ్రదర్స్ మందలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఇప్పుడు ఆ దళితులపై ఎందుకు అంత కపట ప్రేమ అని ఆమె ప్రశ్నించారు నాడు లేని ప్రేమ నేడు కుల రాజకీయాలకు మాత్రమే పనికి వస్తుందని ఎద్దేవా చేశారు దళితుల పథకాలు అన్ని అటకెక్కించిన ఘనత జగన్ కే దక్కిందని పేర్కొన్నారు నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దళితులకు అనేక పథకాలను ప్రవేశపెట్టామని తెలియజేశారు దాడి జరిగిన వారిని పరామర్శించకుండా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోలీసులను తప్పు గా చిత్రీకరించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని తగిన మూల్యం జగన్ చెల్లించుకుంటారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు కనిపించని దళితులు నేడు ఎందుకు గుర్తొస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు…..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు