Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఫలాలు ప్రజలు హక్కు

ప్రభుత్వ ఫలాలు ప్రజలు హక్కు

- Advertisement -

ప్రభుత్వ ఫలాలు పొందడం ప్రజలు హక్కు

విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వం అందించే ఫలాలను పొందడం ప్రజలు హక్కు అని తహసిల్దార్ ఏ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలో ముగ్గుళ్ళ గ్రామంలో ఎస్సీ పేటలో గల ఎంపిపి పాఠశాలలో పౌర హక్కుల దినోత్సవం తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, ఎస్సై డి రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం నందు  మీకొరకు పొందుపరచిన రిజర్వేషన్లు, ప్రత్యేకంగా కేటాయించిన పధకాలు పొందడం కూడా మీ  హక్కుగా భావించాలని తెలిపారు. ఎస్ఐ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషికి రాజ్యాంగపరంగా జీవించే హక్కు ఉందని ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగనంత వరకు మీ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఎంపీపీ జ్యోత్స్న మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అడిగి తీసుకునే హక్కు ఉందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వి ఆర్ ఓ చినరావు, విద్యార్దులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు