యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించే పదవ తరగతి మోడల్ పేపర్లను మండల రిసోర్స్ సెంటర్ , ధర్మవరం నందు మండల విద్యాధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ , యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డితో కలసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారులు గారు మాట్లాడుతూ యుటిఎఫ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది మోడల్ పేపర్ల ప్రచురణ నిర్వహిస్తున్నదని, మోడల్ పేపర్ల రూపకల్పనలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రూపొందించబడి అతి తక్కువ ధరకు తెలుగు ,ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు ఉండే విధంగా, 100 రోజుల ప్రణాళికకు అనుకూలంగా తయారుచేసి అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ మోడల్ పేపర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడటంతో పాటు మంచి ఉత్తీర్ణత సాధించగలిగే సత్తా, ధైర్యం వస్తుందన్నారు.యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ మోడల్ పేపర్ నుంచి ప్రతి ఏడాది 70 నుంచి 80 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయని, ఈ మోడల్ పేపర్ గ్రామీణ విద్యార్థుల శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.మునిసిపల్ బాలికోన్నత పాఠశాల, కొత్తపేట ప్రధానోపాధ్యాయురాలు మేరి వరకుమారి మాట్లాడుతూ గత సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో యుటిఎఫ్ రూపొందించిన మోడల్ పేపర్లలోని ప్రశ్నలు 80 శాతము పైగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించుటకు ఈ మోడల్ పేపర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ధర్మవరం పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సాయి గణేష్, సీనియర్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, లతా దేవి, నాగేంద్రమ్మ, వీరనారాయణమ్మ, విజయలక్ష్మి, రామాంజనేయులు, మోహద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
SSC మోడల్ పేపర్ పుస్తకాల ఆవిష్కరణ..
RELATED ARTICLES