సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్గా చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ మాట్లాడుతూ “పదేపదే అంబేద్కర్ అని ఎందుకంటారు? అంబేద్కర్కు బదులు ఏ హిందూ దేవుడినైనా తలచుకుంటే స్వర్గానికి వెళ్తారు” అని వ్యాఖ్యానించడం దుర్మార్గం. అమితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే దురుద్దేశ్యంతో మోడీ, అమిల్షాల నేతృత్వంలో మతవాదాన్ని నెత్తికెత్తుకుని బిజెపి పాలకులు వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో బిజెపికి స్వంతంగా మెజారిటీ రాకపోవడంతో తటపటాయిస్తున్నారు. అంతేకాకుండా జమిలీ ఎన్నికల పేరుతో ఫెడరల్ స్పూర్తికి తూట్లుపొడుస్తున్నారు. రాష్ట్రాల హక్కులను హరించి కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరచిన అమితా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లౌకిక, ప్రజాతంత్ర వాదులంతా ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరుతున్నాం.