విశాలాంధ్ర పామిడి
అనంతపురం జిల్లా
అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మి నారాయణ జన్మదిన వేడుకలను గురువారం అనంతపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కేక్‌ను కట్ చేశారు సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం నిస్వార్ధ ప్రజా సేవకు ప్రతిరూపం మన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎల్.సి ఆయకట్టు చైర్మన్ ఓబుల రాజు, స్టోర్ డీలర్ కంబగిరియ్యా, చిన్న కృష్ణప్ప, వేణు, పెద్ద నటరాజు, తదితరులు పాల్గొన్నారు.