విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బీరే విజయలక్ష్మి మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20, 21వ తేదీల్లో రీజియన్-1 స్ఫూర్తి సంస్థ నిర్వహణలో రెండు రోజులు పాటు ట్రైన్ ది ట్రైలర్ వర్క్ షాపును నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది ట్రైనర్లు పాల్గొని వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ ప్రజెంటేషన్ ట్రైనింగ్, మెదడాలజీ వంటి కీలక అంశాలపై సమగ్ర శిక్షణ పొందడం జరిగిందని తెలిపారు. ఈ వర్క్ షాప్ లో తాను ప్రతిభ కనపరిచి తనకు ఉత్తమ మోటివేషనల్ స్పీకర్గా ఎంపికై అవార్డుతో పాటు సర్టిఫికెట్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డును ముఖ్య అతిథులైన ఇంపాక్ట్ నేషనల్ సంస్థ ఫౌండర్ నాగేశ్వరరావు, యాక్టర్ ప్రదీప్ ఇంపాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మాధవి, ఇంపాక్ట్ హెడ్ బోర్డ్ మెంబర్ శ్యామ్ రాథోడ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస పెరుమాళ్ళ తదితరుల చేతుల మీదుగా తాను తీసుకోవడం జరిగిందని తెలిపారు. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా మలచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణలు ఇస్తానని తెలిపారు.
మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్న ధర్మవరం పట్టణవాసి బీరే విజయలక్ష్మి
- Advertisement -
RELATED ARTICLES


