Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనుచిత వాక్యాలు, అనుచిత ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులు అరెస్ట్

అనుచిత వాక్యాలు, అనుచిత ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులు అరెస్ట్

- Advertisement -

టూ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో రాజకీయ పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా అనుచిత వాక్యాలు, ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అరెస్టు అయిన వారిలో పట్టణములోని రామ్ నగర్కు చెందిన టి. మల్లికార్జున రెడ్డి, పట్టణంలోని మారుతీ నగర్ కి చెందిన ఆర్ రాజశేఖర్ రెడ్డి, రేగాటి పల్లి గ్రామానికి చెందిన డి. ఓబిరెడ్డి, రేగాటిపల్లి గ్రామానికి చెందిన నీలా వినయ్, మారుతీ నగర్ కు చెందిన దాసరి మల్లికార్జున, మారుతీ నగర్ కు చెందిన సాకే కాసపులను అరెస్టు చేసి కోర్టుకు తరలించి రిమాండ్కు పంపడం జరిగింది అన్నారు. ఈనెల 21వ తేదీన వైయస్సార్ పొలిటికల్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా పై కనపరిచిన 6 మంది ముద్దాయిలు గుంపులుగా ఏర్పడి ధర్మవరం మామిళ్ళపల్లి రోడ్డు మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలతో పాటుగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫ్లెక్సీలను ఉంచి రాజకీయ పార్టీల మధ్య వర్గ వైశాల్యాలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వాక్యాలు ప్రవర్తనలు చేస్తూ, రోడ్డు మీద వచ్చి పోయేవారికి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రజలను భయాందోళనకు గురి చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వేట కొడవలితో పొట్టేలను నరికి వాటి రక్తంతో జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫ్లెక్సీ లకు రక్తాభిషేకం చేసిన నేరములో నల్లగుండ్ల శ్రీనివాసులు యొక్క ఫిర్యాదు పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆరు మందిని గుట్ట కింద పల్లి పెట్రోల్ బంక్ ముందర రోడ్డు మార్జిన్ వద్ద అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు