Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిజయవంతంగా అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జోనల్ పోటీలు..

విజయవంతంగా అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జోనల్ పోటీలు..

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో హైదరాబాదు వారి విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జోనల్ లెవెల్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని జోనల్ మేనేజర్ శివాంజనేయులు టీం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందుకు పట్టణంలోని 20 పాఠశాలలు నుండి దాదాపు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటీలో పాల్గొనడం జరిగిందని వారు తెలిపారు. ఇందులో ప్రతిభ ఘనపరిచిన 50 మందికి ప్రోత్సాహక బహుమతులతో పాటు సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాఠశాల కర్రీస్పాండెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మలాదేవి మాట్లాడుతూ ఇటువంటి పోటీ పరీక్షలు మా పాఠశాలలో నడపడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి కాలంలో అబాకస్ కు ఎంతో మంచి గుర్తింపు ఉందని, పిల్లల మెదడుకు మంచి ఉత్సాహాన్నించే ఇటువంటి పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు