జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ బషీర్
విశాలాంధ్ర ధర్మవరం; జెవివి నాయకులూ,కార్యకర్తలు, ప్రజలూ శాస్త్రీయ ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ బషీర్ తెలిపారు. ఇందులో భాగంగా
స్థానిక స్పందన హాస్పిటల్ లో జెవివి ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ లను జెవివి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పధం కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే దాని పట్ల అవగాహన కలిగి వుండాలన్నారు . ఆ లక్ష్యంతో పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ సైన్స్ సంబంధ అంశాలతో ప్రతీ సంవత్సరం జనవిజ్ఞాన వేదిక రూపొందిస్తున్న క్యాలెండర్ చాలా ప్రాచుర్యం పొందిందన్నారు.
జనవిజ్ఞాన వేదిక క్యాలెండర్ మిగతా క్యాలెండర్లకంటే భిన్నమైనదని ఇందులో శాస్త్రవేత్తల పుట్టినరోజులు, అలాగే మానవిజ్ఞానానికి ప్రాధాన్యత ఉండే రోజులు, అంశాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. జన విజ్ఞాన వేదిక మన రాష్ట్రంలో శాస్త్రీయ విజ్ఞాన వ్యాప్తికి అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేసే సంస్థలలో అగ్రగామి అని, కాబట్టి పౌరులు జనవిజ్ఞాన వేదిక లో సభ్యులు కావడం ద్వారా శాస్త్రీయ సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ విక్రాంత్, జెవివి నాయకులు సురేష్,ఖలందర్,మనోహర్ , సాయి ప్రియ మెడికల్స్ శేషు, హిమజ పాల్గొన్నారు.
శాస్త్రీయ ఆలోచనలతో ముందుకెళ్దాం..
- Advertisement -
RELATED ARTICLES


