విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ సంస్థ ద్వారా ఆర్టీసీ బస్సులలో కార్గో వ్యవస్థ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నదని, ఇందులో భాగంగానే కార్గో డోర్ డెలివరీ ని మరింత అభివృద్ధి పరచాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఆవరణములో డెలివరీ ప్రచార మాసోత్సవాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్గో వ్యవస్థ వ్యాపారస్తుల వద్ద, ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. కార్గో ద్వారా ఒక కేజీ బరువు నుండి 50 కేజీల వరకు (జిఎస్టి అదనం) డోర్ డెలివరీని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఒక్కొక్కరు మూడు డెలివరీనీ కార్గొ ద్వారా ద్వారా చేయించి కార్గో అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఆర్టీసీ సంస్థకు పరోక్షంగా కార్బో వ్యవస్థ ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ఈ డోర్ డెలివరీ వ్యవస్థను మనతోపాటు మన కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు, భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ఈనెల 20వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ డోర్ డెలివరీ సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 80 ప్రాంతాలలో కలదని తెలిపారు. 50 కేజీల బరువు వరకు పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం కలదని తెలిపారు. ఆర్టీసీ సంస్థలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లతోపాటు కార్యాలయ సిబ్బంది తాము బస్సు ఎక్కి సర్వీస్ చేసేటప్పుడు దిగి పోయే ప్రయాణికులకు డోర్ డెలివరీ సౌకర్యం గురించి తెలిపి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. మన ధర్మవరం డిపోకు ఇచ్చిన టార్గెట్ ను అందరూ సహాయ సహకారాలు అందించి ఆర్టీసీ సంస్థను అభివృద్ధి బాటలో నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీరాములు, రామ్మోహన్ రెడ్డి, డిపో మెకానికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్గో డోర్ డెలివరీ ని మరింత అభివృద్ధి పరచండి.. డిపో మేనేజర్ సత్యనారాయణ
RELATED ARTICLES