Homeఆంధ్రప్రదేశ్అమెరికన్ అతిథిని ఫిదా చేసిన తాపేశ్వరం సురుచి కాజా

అమెరికన్ అతిథిని ఫిదా చేసిన తాపేశ్వరం సురుచి కాజా

- Advertisement -

విశాలాంధ్ర – మండపేట : సంక్రాంతి సంబరాల సందర్భంగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన ఓ అతిథి, రాజమహేంద్రవరంలోని తన స్నేహితుడి ఆహ్వానంతో తూర్పుగోదావరి జిల్లాలో పండుగ ఉత్సవాలను ఘనంగా ముగించుకున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా సురుచి ఫుడ్స్ సిబ్బంది అతిథికి సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం తాపేశ్వరం కాజా తయారీ విధానం, దాని ప్రత్యేకతలను వివరించారు. కాజా రుచికి ముగ్ధుడైన ఆ అమెరికన్ అతిథి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, భారతదేశంలో తనకు లభించిన అపూర్వమైన ఆదరణకు, సన్మానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాపేశ్వరం సురుచి ఫుడ్స్ భారతీయ సంప్రదాయం, అతిథి సత్కారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి తప్పకుండా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ను సందర్శిస్తానని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు