Homeరూ.6 లక్షల కోట్లు ఆవిరి

రూ.6 లక్షల కోట్లు ఆవిరి

- Advertisement -

. కుప్పకూలిన సెన్సెక్స్
. అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి
. బంగారం ధర పైపైకి

ముంబై: భారతీయ మార్కెట్లు శుక్రవారం ఖంగుతున్నాయి. స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. రూపాయి రికార్డు స్థాయికి పతనమైంది. బంగారం ధర ఇప్పటికే దడ పుట్టిస్తున్నది. ఉదయం స్వల్ప లాభాలతో 82,335.94 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమై… ఒక దశలో 800 పాయింట్ల” నష్టపోయింది. చివరకు 769.67 పాయింట్లు (1 శాతం) నష్టంతో 81,537.70 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ కూడా 241.25 పాయింట్లు నష్టపోయి 25,048.65 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం, అమెరికా-యూరప్ సుంకాల యుద్ధం వంటివి స్టాక్ మార్కెట్లను నష్టాý బాట పట్టించాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో రూ. 36,591 కోట్ల విలువైన షేర్లT అమ్మేశారు. ప్రస్తుతం బీఎసఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.452 కోట్లకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారక విలువ 91.93తో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. 0.02 శాతం రూపాయి నష్టపోయింది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎటెర్నల్, అదానీ పోర్ట్స్, ఇండిగో వంటి సంస్థలు నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునీలీవర్, ఏషియన్ పెయింట్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బంగారం ఔన్స్ ధర 4,926 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర 64.79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎఫఐఐ అమ్మకాలు, ముడి చమురు ధరలు, డాలర్ బలంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న రిస్క్-ఆఫ్ భావన మధ్య రూపాయి ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక దశలో 92 స్థాయికి చేరి, చివరికి 91.88 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది. బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు, నిరంతర విదేశీ నిధుల వెనక్కి వెళ్లడమే రూపాయిపై తీవ్ర ఒత్తిడిని తెచ్చిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో రూపాయి ప్రారంభంలో కొంత లాభాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఫలితంగా అమెరికన్ డాలర్‌కు వ్యతిరేకంగా 91.99 అనే రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ ఎగబాకడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపించాయి. గతంలో నమోదైన కనిష్ట స్థాయిల నుంచి రూపాయి పుంజుకొని, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 7 పైసల లాభంతో 91.58 వద్ద గురువారం ముగిసింది. ఆ బలం ఎక్కువసేపు నిలబడలేదు. ఈనెల 21న రూపాయి 68 పైసలు పడిపోయి 91.65 వద్ద ముగియడంతో ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయి రికార్డు నమోదైంది. ఆ తర్వాతి రోజుల్లో పరిస్థితి మరింత క్షీణించింది. ఈ నెలలో ఇప్పటి వరకు 200 పైసలు లేదా 2 శాతానికి పైగా రూపాయి విలువ పడిపోయింది. 2025 సంవత్సరం మొత్తాన్ని చూసుకుంటే, విదేశీ నిధులు వెనక్కి వెళ్లడం, డాలర్ బలంగా ఉండటంతో దేశీయ కరెన్సీ 5 శాతం వరకు పడినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిపై మిరే అసెట్ షేర్ ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి స్పందిస్తూ, ‘ఎఫఐఐల అమ్మకాల ఒత్తిడి, గ్లోబల్ మార్కెట్లలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ కారణంగా రూపాయి ప్రతికూల ధోరణితో ట్రేడవుతోంది. హెడ్జర్స్, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్ కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది’ అని అన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడితే లేదా ఆర్బీఐ జోక్యం చేసుకుంటే, తక్కువ స్థాయిల వద్ద రూపాయికి కొంత మద్దతు లభించే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో యూఎస్‌డీఐఎనఆర్ స్పాట్ ధర 91.60 నుంచి 92.30 మధ్య ట్రేడయ్యే అవకాశముందని చౌదరి వెల్లడించారు. కాగా, విదేశీ నిధుల నిరంతర అమ్మకాలే రూపాయి దేశీయ మార్కెట్లపై ప్రధానంగా ఒత్తిడి పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు అన్నారు. ఇదిలావుంటే, దేశీయంగా మేలిమి బంగారం (24 క్యారెట్ లేదా 99.9 స్వచ్ఛత) తులం రూ.1.5 లక్షలకుపైగానే పలుకుతున్నది. 10 గ్రాముల విలువ రూ.2.5 లక్షలకT చేరేందుకు ఎంతోకాలం పట్టకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో బంగారం ధరలు 73 శాతం పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 4,800 డాలర్ల మార్కును దాటేసింది. మరో 46 శాతం పెరుగుదలకు వీలుంది. 7వేల డాలర్లకు చేరవచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే తులం బంగారం ధర రూ.2.5 లక్షల మార్కు దాటేస్తుంది. అంతర్జాతీయ పరిణామాలు, మారుతున్న పెట్టుబడుల సరళితో బంగారం ధరల ప్రభావితమవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయికి చేరాయి. గ్రీన్‌లాండ్ వ్యవహారంలో యూరప్‌పై అదనపు సుంకాలకు బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతుండటం వల్లే బుల్ రన్‌కు బ్రేకులు పడ్డాయి. ఈక్విటీ మార్కెట్లకు మళ్లీ జోష్ వచ్చింది. అయినప్పటికీ లాంగ్ రన్‌లో బంగారం, వెండికి ఆదరణ కొనసాగుతుందనే అభిప్రాయం మార్కెట్ వర్గాలు ఉంది.
అదానీ రూ.1.14 లక్షల కోట్ల నష్టం
అదానీ సంస్థకు అమెరికా సెగ తాకింది. ట్రంప్ దెబ్బకు ఈ సంస్థకు ఒక్క రోజులో రూ.1.4లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. షేర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. అదానీ సంస్థ సీనియర్లపై చట్టపరమైన చర్యలకు అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ… సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎసఈసీ) కోర్టు అనుమతి కోరిన వార్తతో అదానీ సంపద భారీగా ఆవిరయ్యింది. సంస్థ చైర్మన్ గౌతమ్ ఆయన మేనల్లుడు సాగర్‌కు నోటీసులు ఇచ్చేందుకుగాను డిస్ట్రిక్ట్ జడ్జిని ఎసఈసీ యూఎస్ ఆశ్రయించింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జడ్జి నికోలస్ గరౌఫిస్ ఎదుట దరఖాస్తు చేయగా,రు. సాధారణ మార్గాల కాకపోతే, ఇతర చట్టపరమైన మార్గాలలో అదానీలకు విషయాన్ని తెలియజేయమని కోరింది. సమన్ల జారీకి గతంలో ప్రయత్నించినా ఫలితం లేదని తెలిపింది. భారత ప్రభుత్వ సహాయం పొందేందుకు అనేకసార్లు విఫల ప్రయత్నం చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో అదానీ గ్రూప్ స్టాక్‌లు క్షీణతను చవిచూశాయి. స్టాక్‌లు భారీ అమ్మకాలను చూశాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ 7.7 శాతం తగ్గి, ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.835కి చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రెండూ కూడా 5.7 శాతం తగ్గి వరుసగా రూ.1,968.20, రూ.872.10 కనిష్ట స్థాయిలను తాకాయి. అదానీ పోర్ట్స్ 4.5 శాతం తగ్గి రూ.1,351కి చేరుకోగా, అదానీ టోటల్ గ్యాస్ 4.1 శాతం తగ్గి రూ.525.60కి చేరుకుంది. అదానీ పవర్ కూడా 3 శాతం తగ్గి రూ.136.85 కనిష్ట స్థాయికి చేరుకుంది. సిమెంట్ స్టాక్స్ కూడా ఒత్తిడిలోకి వచ్చాయి. అంబుజా సిమెంట్స్ 2.5 శాతం, ఏసీసీ 1.4 శాతం పడిపోయాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు