Homeఅంతర్జాతీయంమారిన ట్రంప్‌ స్వరం

మారిన ట్రంప్‌ స్వరం

- Advertisement -


అఫ్గానిస్థాన్‌తో యుద్ధంలో నాటో దేశాలు దూరంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంలో ట్రంప్‌ స్వరం మార్చారు. యూకే సైనికుల కృషిని ప్రశంసిస్తూ ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. యూకేకు చెందిన గొప్ప, ధైర్యవంతులైన సైనికులు యూఎస్‌కు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. అఫ్గాన్‌లో మరణించిన 457 మంది యూకే సైనికులు, తీవ్రంగా గాయపడిన వారిని గొప్ప యోధులుగా అభివర్ణించారు. ఇరుదేశాల మధ్య ఉన్న సైనిక బంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాలేనంత బలంగా ఉందన్నారు. కాగా.. ఇటీవల ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు అవసరమైనప్పుడు నాటో దేశాలు అండగా ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. అయినా వారి అవసరం మాకు లేదన్నారు. ఈ క్రమంలోనే అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా సేనలే ముందు ఉన్నాయని, నాటో దేశాలు దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ వ్యాఖ్యలు తమ సైనికులను అవమానించడమేనని.. దీనికి ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే బ్రిటిష్‌ సైనికులను ప్రశంసిస్తూ ట్రంప్‌ పోస్టు పెట్టడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు