Monday, December 23, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజల సౌకర్యార్థం రవాణా సేవలు .. మంత్రి సత్య కుమార్ యాదవ్

ప్రజల సౌకర్యార్థం రవాణా సేవలు .. మంత్రి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం; ప్రజలకు రవాణా శాఖ ద్వారా సేవలన్నీ సులభతరంగా అందించాలన్న ధ్యేయంతో ధర్మవరం మార్కెట్ యార్డ్ ప్రాంతంలో రవాణా శాఖ విభాగం ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖల మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మార్కెట్ యార్డులో రవాణా శాఖ ఏర్పాటుచేసిన ఆన్లైన్ సేవలను మంత్రి ప్రారంభించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కరుణాసాగర్, కదిరి ఎం .వి.ఐ వరప్రసాద్ , ధర్మవరం ఎం.వి.ఐ రాణి, ఆర్డీవో మహేష్ ధర్మవరం తెలుగుదేశం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ , రాష్ట్ర జనసేన నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి , ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనాల కు సంబంధించి లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఎల్ ఎల్ ఆర్, ఫిట్నెస్, పర్మిట్లు మంజూరు తదితర సర్టిఫికెట్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ప్రజలు రవాణా శాఖ ద్వారా సేవలు పొందాలంటే హిందూపురం ,అనంతపురం, కదిరి ప్రాంతాలకు వెళ్లే వారిని ప్రస్తుతం 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శ్రమను తగ్గించి ప్రస్తుతం తాత్కాలికంగా రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి , రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అవసరమైన మేరకు రవాణా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలో అనేక పరిపాలన నిర్మాణాత్మకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శాశ్వత రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేయుటకు ఆర్డిఓ ,రవాణా శాఖ అధికారి ద్వారా భూసేకరణకు సంబంధించి ప్రతిపాదన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల కాలంగా రవాణా శాఖ కార్యాలయం లేని కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి ధర్మవరం పట్టణంతోపాటు రాప్తాడు నియోజకవర్గం లోని రామగిరి, సి.కే.పల్లి, కనుగానపల్లి మండల ప్రజానీకానికి కూడా ప్రమాణ శాఖ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందువల్ల ఈ ఆరు మండలాలకు సంబంధించిన ప్రజలు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతేగాక చెరువులకు నీరు పటలకు సాగునీరు జలజీవన్ మిషన్ పనులు తదితర కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మరి ముఖ్యంగా పట్టణ గ్రామాలలో గుంతలు లేకుండా రహదారుల నిర్మాణం కోసం సుమారు రూ.26 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు రూ. 70 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పెట్రోల్ ,డీజిల్ ఆదా చేసే క్రమంలో ఎలక్ట్రానిక్ వాహనాలు కూడా ప్రభుత్వం ద్వారా వాడుకలో రానున్నాయని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు