సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణకు హీరో అర్జన్ నేడు హాజరయ్యారు.. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం నుంచి న్యాయవాదిలో కలసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. పుష్ప మూవీ హీరో అల్లుఅర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరుకావాలంటూ నోటీస్ పంపారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు.