Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రూపు-2లో ఏఎస్ఓ పోస్టుకు ఎంపికైన పూర్ణిమ

గ్రూపు-2లో ఏఎస్ఓ పోస్టుకు ఎంపికైన పూర్ణిమ

- Advertisement -

స్వయంకృషతో సాధించిందని కుటుంబ సభ్యులు ప్రశంసలు

విశాలాంధ్ర-రాప్తాడు: రాప్తాడు గ్రామానికి చెందిన గంజి పండయ్య, జ్ఞానేశ్వరి దంపతుల కుమార్తె గంజి పూర్ణిమ మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చాటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరుగా ఉద్యోగం సాధించింది. గంజి పూర్ణిమ తల్లిదండ్రులు వ్యవసాయంపైన ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేవారు. పూర్ణిమ ఐఐఐటీలో సీటు వచ్చినా కూడా అడ్మిషన్ పొందకుండా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. రెండేళ్ల నుంచి తెలుగు అకాడమీ పుస్తకాలు, వివిధ మాసపత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని గ్రూప్-2 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. పూర్ణిమ గ్రూప్-2 ఉద్యోగం సాధించడంతో ఆమెకు తల్లిదండ్రులు, అన్న కేశవ సంతోషంగా కేకు తినిపించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉద్యోగం చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు