- Advertisement -
రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(67) తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఉండగా శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా. అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు.


