సజ్జల రామకృష్ణారెడ్డి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు పచ్చ అబద్ధాలని, సీబీఐ ఛార్జిషీట్ ద్వారా ఈ విషయం వెల్లడయిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా ఈ విషయం తేట తెల్లమైందని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు. తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు… అది తప్ప్పు అని తెలిసినా క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారన్నారు. పైగా సిట్ నివేదికతో తనను తాను సమర్థించుకోలేని సీఎం మరింత దిగజారి లడ్డూపై మరలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో బాబును ప్రజా క్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. గతంలో చంద్రబాబు బోలే బాబా డెయిరీని ప్రోత్సహిస్తే… వైసీపీ హయాంలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సైతం తప్ప్పుపట్టిందని… తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆనందపడాల్సింది పోయి… మరలా విష ప్రచారానికి తెర లేపడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్లను రాక్షస తెగ అనడంలో తప్ప్పులేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నోరెత్తకపోయినప్పటికీ… మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
తన వ్యాఖ్యలకు కట్టుబడిలేకపోతే… చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలతోనే వివాదం మొదలైందని, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారని వివరించారు. అందులో మనం గమనించాల్సిన ప్రధాన అంశం… జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మకమైన లేబోరేటరీ రెండూ తమ రిపోర్టులో చంద్రబాబు చేసిన నీచమైన, అన్యాయమైన ఆరోపణలు అబద్ధమని తేల్చాయని తెలిపారు. బోలేబాబాను ప్రోత్సహించిందే బాబు అని, సుప్రీం కోర్టు సైతం చంద్రబాబు వ్యాఖ్యలను తప్ప్పు పట్టిందన్నారు. రెండు జాతీయ సంస్ధలు ఇచ్చిన రిపోర్టుల్లో చాలా స్పష్టంగా నెయ్యిలో జంతు కొవ్వు లేదని స్పష్టమైందని, ఆ ల్యాబ్ రిపోర్టు ద్వారా చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధమని రుజువైందని సజ్జల తేల్చిచెప్పారు.
సీబీఐ చార్జిషీట్‌తో వెలుగుచూసిన వాస్తవాలు
- Advertisement -
RELATED ARTICLES


