-ఏపీ రైతు సంఘండి మాండ్
విశాలాంధ్ర బ్యూరో–నెల్లూరు : ఫిబ్రవరి 15వ తేదీ నుండి రబి ధాన్యం పంట మార్కెట్లోకి వస్తుందని వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని అందువల్ల అధికారులు యూరియా పంపిణీలు జరుగుతున్న కొన్ని తప్పిదాలను సరిదిద్దాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామకోటయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రమణయ్య మాట్లాడుతూ జిల్లాలో రబి సుమారు సుమారు 6 లక్షల ఎకరాలలో వరి వేశారని సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రెండు దాఫాలుగా మార్కెట్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మద్దతు ధర క్వింటాలకి 2389 రూపాయలు నిర్ణయించిందని అయితే ఈ మద్దతు ధర చాలదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో క్వింటాల్ ధాన్యానికి 3000 రూపాయలు ఇస్తుందని ఆ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్వింటాలకి సబ్సిడీతో సహా 3000 రూపాయలు ఇవ్వాలని అలాగే పొట్టిదాన్యానికి 25000 చెల్లించాలని జిల్లాలో ఫిబ్రవరి నెలలో యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని పంపిణీలో అవకతవకలను అరికట్టి రైతులందరికీ యూరియా పంపిణీ జరిగేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శాన్వాస్, పి శిరీషలు పాల్గొన్నారు.


