విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ మాధవి పదవి విరమణ కార్యక్రమ వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ ఆధ్వర్యంలో వారు ఆసుపత్రికి చేసిన సేవలను గూర్చి కొనియాడారు. ముఖ్యఅతిథిగా అనంతపురం డి సి హెచ్ ఎస్ డేవిడ్ రాజు, శ్రీ సత్య సాయి జిల్లా డిసిహెచ్ఎస్ మధుసూదన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ పట్టణంలోని రోగుల వద్ద మనం చేసే సేవలు దైవ సేవతో సమానమని తెలిపారు. ప్రజలు భగవంతుని తర్వాత వైద్యున్ని దేవునితో సమానంగా చూస్తారని తెలిపారు. ఇటువంటి వృత్తి మనకు రావడం అదృష్టంగా భావించాలని తెలిపారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ నా సర్వీస్ లో కార్యాలయ ఉద్యోగులకు, సిబ్బందికి నా సహాయ సహకారాలు అందించా నని, అందరి సహాయ సహకారంతోనే నా వృత్తికి పూర్తి న్యాయం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం డాక్టర్ మాధవిని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ మాధవి పదవీ విరమణ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


