Homeఆంధ్రప్రదేశ్ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవు

ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవు

- Advertisement -

ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్

రాష్ట్రంలో పలుచోట్ల వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు తనకు అందాయని చెప్పారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని… ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని,ప్రజలను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని… అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధింత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రజల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రధానమని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు