వైయస్సార్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచిన ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసనగా విద్యుత్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల కేతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్సీపి నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాంరెడ్డి, చేనేత నాయకుడు కాచర్ల అంజి, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు నడుమ ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ ఏర్పడి ఏడాది తిరగకుండానే, విద్యుత్ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరచడం జరిగిందని వారు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పట్టణంలోని కాయగూర గల మార్కెట్ వద్ద గల విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని వారు దుయ్య బట్టారు. విద్యుత్ ఛార్జీలను 15 వేల కోట్లు భారాన్ని పేద ప్రజలపై మోపడం అతి దారుణమని, దుర్మార్గమని వారు తెలిపారు. పెద్ద ఎత్తున పోరాటాలు సలిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, కే తా లోకేష్, మేడాపురం వెంకటేష్ ,బోయ రమాదేవి, గజ్జల శివ, బలం ఓబులమ్మ, వైయస్సార్ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు పురుషోత్తం, అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వార్డు ఇన్చార్జులు కత్తి కత్తి పెద్దన్న, కేశవరెడ్డి చౌడప్ప తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా..
RELATED ARTICLES