- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఉరవకొండ పట్టణానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు వరప్రసాద్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా శనివారం వరప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఉరవకొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


