Homeరద్దు చేస్తారా… గద్దె దిగుతారా?

రద్దు చేస్తారా… గద్దె దిగుతారా?

- Advertisement -

. లేబర్‌కోడ్‌లపై గర్జించిన కార్మిక, కర్షక, ఉద్యోగసంఘాలు
. రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు
. పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకుంటాం: ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సమ్మెను పురస్కరించుకుని కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘాలు పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యపట్టణాల్లో వేలాది మందితో భారీ ప్రదర్శనలు జరిగాయి. పల్లె, పట్నం తేడా లేకుండా కార్మికలోకం కదం తొక్కింది. ఉద్యోగ సంఘాలన్నీ సమ్మెలో భాగస్వామ్యమయ్యాయి. శాఖల వారీ ఉద్యో గులు విధులు బహిష్కరించి లేబర్‌కోడ్‌లపై నిరసన తెలియజేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర నగర పాలక సంస్థ కేంద్రాల్లో కార్మికలోకం కదం తొక్కింది. కిలోమీటర్ల పొడవునా ప్రదర్శనలు సాగాయి. మున్సిపల్, భవన నిర్మాణ కార్మికులు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, స్కీమ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, గోడౌన్ల హమాలీలు, బజారు జట్లు, ముఠా కార్మికులు, ఆర్టీసీ, అంగన్‌వాడీ, సహకార ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు, బ్యాంకులు, ఎలఐసీ తదితర ఏఐటీయూసీ, సీఐటీయూ అనుబంధŠ సంఘాల యూనియన్లకు చెందిన ఉద్యోగులతో పాటు రైతు, మహిళా, యువజన, విద్యార్థి, జర్నలిస్టు సంఘాలకు చెందిన శ్రేణులు కూడా పెద్దసంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎటుచూసినా ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఎర్ర చొక్కాలు ధరించిన కార్మికులతో వీధులు ఎరుపెక్కాయి. విప్లవ గేయాలు, డప్ప్పుల నత్యాలు, కార్మికుల నినాదాలతో నగరాలు మారుమ్రోగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే మోదీ గద్దె దిగాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య హెచ్చరించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో వేలాది మంది కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వన్‌టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు ఏఐటీయూసీ, సీఐటీయూ సహా మొత్తం 10 కేంద్ర కార్మిక సంఘాల అధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో కార్మిక లోకం కదం తొక్కింది. అనంతరం లెనిన్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, సీఐటీయూ నాయకుడు కె.దుర్గారావు అధ్యక్ష వర్గంగా నిర్వహించిన బహిరంగ సభలో ఈశ్వరయ్య ప్రసంగించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల కాలంలో దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు అమలు చేశారని తీవ్రంగా విమర్శించారు. కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, హక్కుల కోసం ప్రశ్నించే అవకాశం లేకుండా నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలను రద్దు చేశారని మండిపడ్డారు. దీనికి ‘భారతీయ కరణ’ అనే పేరు పెట్టి దేశభక్తి ముసుగులో కార్మిక హక్కులను కాలరాశారని దుయ్యబట్టారు. స్వాతంత్య్రం రాకముందు దేశంలో కేవలం నాలుగు చట్టాలే ఉండేవని, స్వాతంత్య్రం అనంతరమే కార్మికులకు కేంద్ర చట్టాల రక్షణ కల్పించారని గుర్తు చేశారు. తప్ప్పుడు ప్రచారంతో కార్మికులకు ఉపయోగపడే చట్టాలు రద్దు చేసి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారని, వాటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. హామీ ఇచ్చినప్పటికీ అదే విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, కొత్త పథకాల పేరుతో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపుతూ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అప్ప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ భారం మోయలేని పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. కార్పొరేట్ల సంపదను పెంచేందుకు శ్రమజీవులపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గంతో కలిసి కమ్యూనిస్టులు పోరాటం కొనసాగిస్తారని ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తోందని అన్నారు. కార్మిక వర్గ ఐక్యతను దెబ్బతీయడానికి కులం, మతం పేరుతో చిచ్చు పెట్టే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా దుయ్యబట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మోదీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్టగొట్టే చట్టాలు చేస్తోందని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తే సహించేది లేదని, వాటిని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. దేశ వ్యాపితంగా సుమారు 40 కోట్ల మంది సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారని, మోదీ ఇకనైనా నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్, లిబరేషన్ నాయకులు డి.హరినాథ్, ఆరఎస్‌పీ నాయకులు జానకిరాములు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీఐటీయు నాయకులు ఏవి నాగేశ్వరరావు, ఐఎఫ్‌టీయు నేత పొలారి, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, వైఎస్సార్‌టీయూ నాయకులు పి.గౌతం రెడ్డి, సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్, ఆర్‌టీసీ రాంబాబు, ఏపీఎస్‌పీడీసీఎల్ పవన్, ఏఐటీఈఏ వైఎస్ రావు, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ నేత వర్మ తదితరులు ప్రసంగించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కళాకారులు ఆర్.పిచ్చయ్య, చంద్రనాయక్ విప్లవగేయాలు అలపించి కార్మికులను ఉత్తేజపరిచారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : జేవీఎస్, మానం ఆంజనేయులు
దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా విశాఖలో కేంద్ర కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం నిర్వహించిన నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జేవీ సత్యనారాయణ మూర్తి, ప్రముఖ సహకారవేత్త, మాజీ శాసనసభ్యులు మానం ఆంజనేయులు పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్ పర్యవేక్షణాధికారి కార్యాలయం ముందు జరిగిన నిరసనలో ఏఐటీయూసీ జాతీయ నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్‌లు నాలుగు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సరస్వతీ పార్కు నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ప్రదర్శనలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్‌జే అచ్యుతరావు తదితరులు ప్రసంగించారు.
ప్రజా తిరుగుబాటు తప్పదు: అక్కినేని వనజ
మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా తిరుగుబాటు తప్పదని సీపీఐ జీతీయ కార్యవర్గసభ్యురాలు అక్కినేని వనజ హెచ్చరించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఎన్టీఆర్ పార్కు వరకు భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా మారనున్నాయని తెలియజేస్తూ ఉరితాళ్లు మెడలకు బిగించుకుని కార్మికులు చేసిన ప్రదర్శన… మోదీ, అమిత్ షా, చంద్రబాబు విచిత్ర వేషధారణ నగర ప్రజలను ఆకట్టుకుంది. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది.
కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర: డి.జగదీష్
ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఎఫ్‌టీయూ, వైఎసఆర్‌టీయూ, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ఆర్టీసీ, ఎలఐసీ ఉద్యోగులు తదితర సంఘాల అధŠ్వర్యాన అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన సభ జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు ముత్తూజు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రజల హక్కులను హరించే విధానాలు కొనసాగిస్తే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
లేబర్‌కోడ్‌లు రద్దు చేయకుంటే ఉద్యమం తీవ్రం: జంగాల, వెలుగూరి
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయకుంటే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకష్ణమూర్తి, సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్ హెచ్చరించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, సీఐటీయూ నగర కన్వీనర్ బి.ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగించారు.
మోదీకి కార్మిక సెగ: డేగ ప్రభాకర్
మోదీ నిరంకుశ పాలనకు విసిగి పోయిన కార్మిక, కర్షక వర్గాలు కోట్లమంది రోడ్డెక్కారని, ఇప్పటికైనా మోదీ గ్రహించి నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ హెచ్చరించారు. జాతీయ సమ్మెలో భాగంగా అమలాపురం ఈదరపల్లి వంతెన నుండి ఏఐటీయూసీ¾, సీఐటీయూ, ఆర్టీసీ, అంగన్వాడి, పలు ప్రజా సంఘాల అధ్వర్యంలో గడియార స్తంభం వరకు జరిగిన భారీ కార్మిక ర్యాలీకి డేగ ప్రభాకర్ నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే: తాటిపాక మధు
నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు స్పష్టం చేశారు. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పేపర్ మిల్లు, హార్లిక్స్ ఫ్యాక్టరీ, కోకో ప్లాంట్ జట్ల సంఘం, మున్సిపల్ కార్మికులు స్థానిక కోటిపల్లి బస్ స్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ర్యాలీ సాగింది. మధు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని మధు హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనల్లో భాగంగా కర్నూలులో జరిగిన ప్రదర్శనలో చేతివత్తిదారులు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, జి.కొండూరులో జరిగిన భారీ ప్రదర్శనలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వరరావు, విజయవాడ దాసరి భవన్ నుంచి ప్రారంభమైన ఆటో కార్మికుల ర్యాలీలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రదర్శనలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్, చిత్తూరులో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి నాగరాజు, కడపలో జిల్లా సీపీఐ కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ నాయకులు నాగ సుబ్బారెడ్డి, పార్వతీపురంలో ఏఐటీయూసీ నాయకులు ఆర్‌వీఎస్ కుమార్, చల్లపల్లిలో సీపీఐ కష్ణా జిల్లా సహాయకార్యదర్శి అడ్డాడ ప్రసాద్, మచిలీపట్నంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్, మోదుమూడి రామారావు, విజయనగరంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు పి.కామేశ్వరరావు, రామకష్ణ, రామభద్రపురంలో జరిగిన రాస్తారోకోలో సీపీఐ విజయనగరం జిల్లాకార్యదర్శి ఓమ్ని రమణ, పెనుగొండలో ఆంజనేయులు, రేపల్లెలో బత్తుల సామ్యూల్ తదితరులు ప్రసంగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు