Friday, December 27, 2024
Homeజిల్లాలువిజయనగరంఘనంగా సిపిఐ శత వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిపిఐ శత వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – నెల్లిమర్ల : నెల్లిమర్ల మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కొండ గుంపాం గ్రామంలో సిపిఐ శత వార్షికోత్సవంలో బాగంగా పార్టీ మండల కార్యదర్శి మొయిద పాపారావు అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సాధనలో సిపిఐ అగ్రగామిగా నిలిచిందని, దున్నేవానికి భూమి దక్కాలంటూ ఉద్యమం చేసిందని, భూ సంస్కరణల చట్టం కోసం పోరాడి లక్షలాది ఎకరాలు భూ పంపిణీ చేసిందని, కార్మిక చట్టాలు హక్కుల సాధనకు నిర్విరామంగా పోరాడిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలిపల్లి సూరి ఎడ్ల పైడినాయుడు తవిటి నాయుడు నడిపిన రామ్మూర్తి బెల్లం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు