Friday, December 27, 2024
Homeజిల్లాలుకర్నూలుకూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి

కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వం యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఏఐవైఎఫ్ మండల సమావేశం మండల అధ్యక్షులు మహ్మద్ ఉసేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యువతకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం పెద్దకడబూరులోని లక్ష్మి పేటలో ఏఐవైఎఫ్ శాఖను ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా రాముడు, కార్యదర్శిగా హనుమంతును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి షేక్ హజరత్ భాష, సహాయ కార్యదర్శి అల్లా బకాష్, సిపిఐ చిన్నకడబూరు శాఖ కార్యదర్శి తిక్కన్న, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు