ఏపీలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా ‘మనమిత్ర్ణ ద్వారా పొందొచ్చు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్/ప్రథమ ఇంటర్ హాల్‌టికెట్ నంబర్/ఆధార్ నంబర్/ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే)తో పాటు పుట్టిన తేదీ లేదా పేరు, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఇలా..
మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకోండి
ఆ నంబర్‌కు Hi అని మెసెజ్ పంపితే మీకు ఓ లింక్ వస్తుంది.
Choose services అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
Education services ఆప్షన్‌ను ఎంచుకొని క్లిక్ చేయండి
IPE 2026 Hall Ticket అనే ఆప్షన్ కనబడుతుంది.
మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే టెన్త్ హాల్‌టికెట్/ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సెకండ్ ఇయర్ విద్యార్థులైతే ఫస్ట్ ఇయర్ హాల్‌టికెట్ నంబర్/ఆధార్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్ మీ వాట్సప్ నంబర్‌కే వచ్చేస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
మరోవైపు, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది కలిపి మొత్తంగా 10,57,899 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది సిలబస్‌తోపాటు ప్రశ్నపత్రాల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. సమాధానాలు రాయడానికి ఇప్పటి వరకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తుండగా.. ఈసారి మొదటి ఏడాది విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అన్ని ప్రశ్నలకు అందులోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి పేజీలు ఇవ్వరు. ప్రథమ సంవత్సరంలో గణితం, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో ప్రశ్నల సంఖ్య పెరగడంతో బుక్‌లెట్‌లో పేజీలు పెంచారు. ఛాయిస్ లేకుండా పూర్తిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసినా 28 పేజీలు సరిపోతాయని, అందుకోసమే 32 పేజీల బుక్‌లెట్ తీసుకొచ్చినట్లు ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం గతంలోలానే 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు.


