Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవాలి

విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవాలి

- Advertisement -

కళాశాల కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్

విశాలాంధ్ర ధర్మవరం: ప్రతి విద్యార్థి పట్టుదల, లక్ష్యంతో చదువులో ముందుకు వెళితే బంగారు భవిష్యత్తు లభిస్తుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాలేజ్ డే తో పాటు సరస్వతీ పూజలు విద్యార్థుల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండి వేణుగోపాల్ తో పాటు దాసరి వెంకటేశులు (చిట్టి), పళ్లెం వేణుగోపాల్ హాజరైనారు. తొలుత విద్యార్థుల చేత సరస్వతీ పూజను నిర్వహించారు. తదుపరి కాలేజ్ డే సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ఇష్టపడి కష్టపడి చదివినప్పుడే చదువులో మంచి గుర్తింపుతో పాటు మీ భవిష్యత్తు కూడా ఎంతో మంచిగా ముందుకు వెళుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ కళాశాల విద్యా, క్రీడలు, వివిధ రకాల పోటీలలో చదువుతోపాటు ముందంజలో ఉందని తెలిపారు. ఎంతోమంది దాతలు కళాశాలకు సహాయ సహకారాలను అందిస్తూ దాతలుగా తమ ధాతుత్వమును చాటుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. నేటి సమాజంలో దొంగలించబడనిది చదువు మాత్రమేనని తెలిపారు. ఈ చదువుతోనే మంచి ఉద్యోగం తో పాటు తల్లిదండ్రులకు కూడా సంతోషాన్ని ఇస్తుంది అని తెలిపారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థిని తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకొని చదువు విషయంలో అందరికంటే ముందుగా ఉన్నప్పుడే తగ్గ ఫలితం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులను, చదువులు నేర్పిన గురువులను ఎప్పుడూ మరవరాదని తెలిపారు. చదువు విషయంలో ప్రతిరోజు చదివితేనే పరీక్ష ఫలితాలలో మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ వనిత వాణి కళాశాల యొక్క ప్రగతి వివరాలను తెలియజేశారు. అనంతరం దాత దాసరి వెంకటేశులు (చిట్టి) ప్రతి సంవత్సరము నగదుగా ఇచ్చే 21 వేల రూపాయలను గత సంవత్సరం మార్చిలో ఇంటర్మీడియట్లో మంచి ప్రతిభ ఘనపరిచిన(ఏడు గ్రూపులకు) ప్రధమ నగదు బహుమతిగా 2000 రూపాయలు, ద్వితీయ తెచ్చుకున్న విద్యార్థులకు ఒక వెయ్యి రూపాయలు నగదు బహుమతులను అందజేశారు. ఈ నగదు బహుమతి కేవలం మిమ్ములను ఉత్సాహపరిచేందుకు మాత్రమేనని, మరింత ముందడుగు వేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలిపారు. తదుపరి విద్యార్థినీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వనిత వాణి తో పాటు అధ్యాపకులు, అధ్యాపకు రాళ్లు, తల్లిదండ్రులు, కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు