–అభినందించిన కరెస్పాండెంట్ శంకర్ నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని లయోలా పాఠశాల విద్యార్థులు అబాకస్ పోటీల్లో మంచి ప్రతిభను కనపరచడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ శంకర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబాక పోటీలు విజయవాడలో నిర్వహించగా అక్కడ స్టేట్ లెవెల్ అబాకస్ పోటీల్లో మా పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ చూపి ఛాంపియన్స్ గా నిలవడం జరిగిందని తెలిపారు. మా లయోలా పాఠశాల లో నాలుగో తరగతి విద్యార్థి రితిక జూనియర్ లెవెల్ లో ఛాంపియన్గా, ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ మోహసిన్ సీనియర్ లెవెల్ స్టేట్ సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, తోటి విద్యార్థులు ప్రతిబజాటిన విద్యార్థులకు కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


