విశాలాంధ్ర- రాప్తాడు: హంపాపురం సమీపంలోని మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కాంక్రీట్ 2026 (జ్ఞానాన్వేషణ) పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి
చాంపియన్‌షిప్ అవార్డు సాధించారు. హైదరాబాదులోని మాదాపూర్ రాష్ట్ర కళా గ్యాలరీలో శనివారం జాతీయ స్థాయి కాంక్వెస్ట్ 2026 పోటీలు నిర్వహించారు. సాధించి సంస్థకు గొప్ప కీర్తి
దేశవ్యాప్తంగా 50కు పైగా పాఠశాలలకు సంబంధించిన, 200మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా ఈ పోటీల్లో విజయం సాధించడం గర్వకారణమని మాంటిస్సోరి పాఠశాల ఎం.డి కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా తెలిపారు. రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు మరియు కాంక్వెస్ట్ కో-ఆర్డినేటర్ బి. పక్కిరయ్య సారథ్యంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఏ. పునీత్ రెడ్డి, వి. దీపికా రెడ్డి, 8వ తరగతి చదువుతున్న ఎం. హిమవెన్నెల, పి. వైష్ణవి పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. లాటరీ విధానంలో ప్రాజెక్టులు కేటాయించబడుతూ విద్యార్థులు మూడు గంటల పరిమిత సమయంలో సమస్యలను గుర్తించి, పరిష్కారాలను రూపొందించి, సమర్థవంతంగా ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ మేధస్సుకు సృజనాత్మకత జోడించడంతోపాటు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీం వర్క్, సమయ పాలనలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎం.డి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా,
ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, విద్యార్థులను, మార్గదర్శక ఉపాధ్యాయులను అభినందించారు. జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు హర్షనీయమని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు నూతన ఒరవడితో కృషి చేసిన బోధనా సిబ్బంది ప్రశంసించారు.
జాతీయ స్థాయి జ్ఞాన శోధన పోటీల్లో మెరిసిన విద్యార్థులు
- Advertisement -


