Homeజిల్లాలుఅనంతపురంవీఐటీ వెల్లూరులో ప్రతిభ చాటిన నార్పల అక్క–తమ్ముళ్లు …

వీఐటీ వెల్లూరులో ప్రతిభ చాటిన నార్పల అక్క–తమ్ముళ్లు …

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలానికి చెందిన బాయికాటి ఖాదర్ వలి ఖాన్ దంపతుల పిల్లలు, సరస్వతీ విద్యామందిరం (ఎస్‌వీఎం) పూర్వ విద్యార్థులు అయిన బాయికాటి ఆరీఫ్ ఖాన్, బాయికాటి మహమూదా వీఐటీ వెల్లూరు విశ్వవిద్యాలయంలో ఎం.టెక్ (కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) కోర్సులో విశిష్ట ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు.బాయికాటి ఆరీఫ్ ఖాన్ 9.36 సీజీపీఏతో యూనివర్సిటీ 2వ ర్యాంకు సాధించగా, బాయికాటి మహమూదా 9.27 సీజీపీఏతో యూనివర్సిటీ 4వ ర్యాంకు సాధించి నార్పల గ్రామానికి, తమ కుటుంబానికి, సరస్వతీ విద్యామందిరం పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
వారి విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ ప్రధాన కారణమని పలువురు అభినందించారు. ఈ ఘన విజయం నార్పల ప్రాంత యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాయికాటి ఆరీఫ్ ఖాన్, బాయికాటి మహమూదాలకు సరస్వతీ విద్యామందిరం కుటుంబ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు