Homeజిల్లాలుఅనంతపురంరెయిన్ బో పాఠశాలపాఠశాలలో ఘనంగా తెలుగు భాష, క్రీడా దినోత్సవాలు

రెయిన్ బో పాఠశాలపాఠశాలలో ఘనంగా తెలుగు భాష, క్రీడా దినోత్సవాలు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : తెలుగు భాష భారతదేశంలోని ప్రాచీన, మధురమైన భాషల్లో ఒకటి అని, తెలుగు భాష గొప్పతనాన్ని, సాహిత్య సంపదను, సంస్కృతి – సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, తెలుగు భాషోపాధ్యాయుడు జె. పుల్లయ్య స్పష్టం చేశారు. శనివారం పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో తెలుగు భాషాదినోత్సవం, క్రీడాదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు, ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు భాషకు విశేష సేవలు అందించిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి కూడా కావడం విశేషమన్నారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేశారన్నారు. పండితులకే పరిమితమైన గ్రాంథిక భాషకు బదులుగా ప్రజలు మాట్లాడే వ్యావహారిక భాషను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆయన చేసిన భాషా ఉద్యమం తెలుగు భాష అభివృద్ధిలో ఎంతో కీలకమైనదన్నారు.
తెలుగు భాషకు నన్నయ, తిక్కన, ఎర్రణ వంటి కవులు గొప్ప సాహిత్య సంపదను అందించారని, పోతన, శ్రీనాథుడు, వేమన, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి ఎందరో మహానుభావులు తమ రచనలతో తెలుగు భాషకు కీర్తి తెచ్చారని ప్రశంసించారు. తెలుగు పద్యాలు, పాటలు, కథలు, నవలలు, నాటకాలు మన సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.
ప్రస్తుత కాలంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా విద్యార్థులు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఇంట్లోనూ, సమాజంలోనూ తెలుగును గౌరవంగా ఉపయోగించాలని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తెలుగు భాషను డిజిటల్ ప్రపంచంలో మరింత విస్తరించాలని కోరారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే కీర్తిని నిలబెట్టుకోవాలంటే తెలుగు భాషను ప్రేమించడమే కాకుండా, ఆచరణలోనూ ఉపయోగించాలని హితవు పలికారు.

చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని, అప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతామని పేర్కొన్నారు. ముఖ్యంగా హాకీ మాంత్రికుడుగా పేరు గాంచిన ధ్యాన్ చంద్ క్రీడల్లో రాణించి భారతదేశానికి ఒలంపిక్ క్రీడల్లో హాకీ జట్టుకు సారధ్యం వహించి మూడు సార్లు స్వర్ణ పథకాలు సాధించి పెట్టారని గుర్తు చేశారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్, గోపాల్ మూర్తి, నూర్ బాషా, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు