అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
దసరా సందర్భంగా పారిశుధ్య సిబ్బందికి దుస్తులు, షూ ల పంపిణీ..
విశాలాంధ్ర, శామీర్ పేట్ :- పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా 81 మంది పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు, షూలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పారిశుద్ధ్య సిబ్బందికి రెండు జతల చొప్పున దుస్తులు కుట్టించి అందజేయడంతో పాటు, ప్రతి ఒక్కరికీ ఒక జత షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించి పండుగ సందర్భంగా వారికి అవసరమైన దుస్తులు, షూలను అందచేసినట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, వారికి అవసరమైన సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ మేనేజర్ వేణుగోపాల్, కౌన్సిలర్ గుదే వెంకటేష్ , మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


