మున్సిపల్ చైర్మన్ జాం రవి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే..
విశాలాంధ్ర, శామీర్ పేట్ :- అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాం రవి స్పష్టం చేశారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన వారు రూ.37.50 లక్షల మున్సిపల్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ముందుగా మున్సిపాలిటీ పరిధిలోని 4, 6వ వార్డుల్లో రూ.5 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులు, 16, 17, 18, 19వ వార్డుల్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, మట్టి రోడ్ల అభివృద్ధి, వైకుంఠధామం మరమ్మతులు, వాటర్ పైప్లైన్ పనులు చేపట్టారు. అదేవిధంగా 13, 14, 15వ వార్డుల్లో రూ.7.50 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాటర్ పైప్లైన్ పనులు, 20, 24వ వార్డుల్లో రూ.5 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులు, 22, 23వ వార్డుల్లో రూ.5 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు, 11, 12వ వార్డుల్లో రూ.5 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డుల్లో
అభివృద్ధి పనులు పూర్తయితే రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని స్పష్టం చేశారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి మున్సిపాలిటీనీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మోర్సుబాయి శశిరేఖ, కౌన్సిలర్లు ర్యాకల నీరజ్ గౌడ్, గిరిపల్లి రమేష్, గిరిపల్లి జ్యోతి, గుండ్లపల్లి మహేశ్వరి, చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి, గూడ జంగారెడ్డి, ఇర్రి స్వప్న, కొంపల్లి మాధవి, ఆది అజయ్ కుమార్, పులి ప్రభాకర్, కొల్లాస్ రాజు, మడబోయిన మౌనిక, మున్సిపల్ డీఈ స్పూర్తి, నాయకులు మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, దత్తు గౌడ్, రాంరెడ్డి, స్వామి, యాదగిరి, నర్సింలు, రవీందర్ రెడ్డి, నవీన్, నాగరాజు, సంజీవ, వెంకటేష్, బలరాం, ప్రభాకర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


