Homeతెలంగాణపచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

- Advertisement -

మూడుచింతలపల్లి ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో 20 వేల మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభం..

పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి

విశాలాంధ్ర – శామీర్ పేట్ :- మానవ మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం ఎస్‌బీఐ – సీఎస్‌ఆర్ నిధులతో ఐజీఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన 20 వేల మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జాము రవి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారుల వెంట మొక్కలు నాటాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మోర్సుబాయి శశిరేఖ, కౌన్సిలర్లు ర్యాకల నీరజ్ గౌడ్, ఆది అజయ్ కుమార్, కొల్లాస్ రాజు, గిరిపల్లి రమేష్, నాయకులు మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యాదగిరి, సంతోష్ రెడ్డి, నర్సింలు, నాగరాజు, మురళి,
ఐజీఎఫ్ సిబ్బంది శిరీష, రవికుమార్, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ స్వర్ణలత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు