విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ డిఈఈ గా షేక్ నాగూర్ వలి పదవి బాధ్యతలు చేపట్టారు. వీరు నెల్లూరులో ఏఈ గా ఉంటూ పదోన్నతిపై ధర్మవరంకు బదిలీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై తాను ఎల్లప్పుడూ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటానని, విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా మా కార్యాలయమునకు రావచ్చునని వారు తెలిపారు. అదేవిధంగా విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, వర్షాకాలం వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని తెలిపారు. అక్రమంగా విద్యుత్తును పోల్ ద్వారా వాడితే చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. కావున ప్రజలు సహకరించాలని వారు తెలిపారు.
విద్యుత్ డిఈఈ గా పదవీ బాధ్యతలు చేపట్టిన షేక్ నాగూర్ వలి
- Advertisement -
RELATED ARTICLES


