విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో సవీరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, ప్రజల ఆరోగ్య వివరాలు, వివిధ వ్యాధుల సమాచారాన్ని సేకరించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, రికార్డులు, ఆసుపత్రిలో రికార్డుల నిర్వహణ, ల్యాబ్‌లో రక్తం, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధానంపై ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్, అలాగే వివిధ వ్యాధులకు ఇచ్చే మందులు మరియు మాత్రల పంపిణీపై ఫార్మాసిస్ట్ మూర్తి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. నెల రోజుల శిక్షణ పూర్తయిన సందర్భంగా, దాని గుర్తుగా సవీరా నర్సింగ్ విద్యార్థినులు రాప్తాడు పి.హెచ్.సికి శనివారం రెండు స్టాండింగ్ ఫ్యాన్లను వితరణగా అందజేశారు. విద్యార్థుల ఉదారతను వైద్యాధికారి, సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో సవీరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి, రమ్య, ఆస్పత్రి సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.


