Homeఆంధ్రప్రదేశ్పేదలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 4 లక్షల గ్రామీణ ఇళ్లు

పేదలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 4 లక్షల గ్రామీణ ఇళ్లు

- Advertisement -

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది.ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గ్రామీణ-2.0 కింద రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం వారం నుంచి 10 రోజుల్లో మంజూరు చేసే అవకాశముంది.అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర అధికారులు ఇప్పటికే కేంద్రానికి నివేదించారు.ఈ ఇళ్ల మంజూరుకు కేంద్ర గృహనిర్మాణశాఖ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పీఎంఏవై-2.0 కింద ఇప్పటికే రాష్ట్రానికి 77 వేల గృహాలు మంజూరయ్యాయి.తాజాగా మరో 4 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే.. వాటితో కలిపి మొత్తం ఇళ్లను జిల్లాల వారీగా లబ్ధిదారులకు కేటాయించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే..
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పట్టణ-1.0పథకం కింద రాష్ట్రానికి దాదాపు 19 లక్షల గృహాలు మంజూరయ్యాయి. ఇందులో 2024 కంటే ముందు మంజూరై ఇప్పటివరకు ఇంటి నిర్మాణం చేపట్టని 3.71లక్షల గృహాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.వీటితో పాటు మరో 4 లక్షల గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడంతో లక్షలాది మంది లబ్ధిదారులు అప్పట్లో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో పెద్ద సంఖ్యలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాకుండా నిలిచిపోయాయి.ఈ ఇళ్లను పూర్తి చేసిన తర్వాతే కొత్త గృహాలకు మంజూరు కోసం నివేదించాలని వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే కేంద్రం రాష్ట్రానికి సూచిస్తూ వచ్చింది.

77వేల గృహాలే మంజూరు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొత్త ఇళ్ల మంజూరుకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే తొలి విడతలో రాష్ట్రానికి కేవలం 77 వేల గృహాలే మంజూరయ్యాయి.అయితే రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది వరకు ఇళ్లు లేని పేదలు ఉన్న నేపథ్యంలో.. వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపింది.ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద ఉన్న 25 లక్షల బఫర్‌ స్టాక్‌ నుంచి రాష్ట్రానికి 4 లక్షల ఇళ్లను కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం.

అస్తవ్యస్త లేఔట్లను నివాసయోగ్యంగా మార్చే చర్యలు
వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన లేఔట్లను నివాసయోగ్యంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు.ఇందుకు అవసరమయ్యే నిధులపై అంచనాలు రూపొందించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు.లేఔట్లలో ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల వివరాలను సేకరించాలని ఏఈలను ఆదేశించారు.అలాగే, పీఎం జన్‌మన్‌ కింద ఆదివాసీలకు మంజూరైన 43,592 గృహాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ గృహాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు 9 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు