–రూ. 10 వేలు విరాళం అందజేసిన గోవింద నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో నిత్యము పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శాశ్వత పూజకుగాను దాత ఎస్. గోవిందు నాయుడు తన వంతుగా పదివేల రూపాయలను విరాళంగా కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి పాలకవర్గం అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి కార్యదర్శి రామలింగయ్య దాత పేరుటన ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు. అనంతరం దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప కార్యదర్శి జే సి. నాయుడు, కోశాధికారి సూర్యనారాయణ, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయము శాశ్వత పూజకు విరాళం
- Advertisement -
RELATED ARTICLES


